ELR: ముసునూరు గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ బుధవారం ఆందోళన చేపట్టింది. యూనియన్ మండల కన్వీనర్ బుడుపుల జయశ్రీ మాట్లాడుతూ.. 2005 నుంచి అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని కొనసాగించాలన్నారు. కొత్తగా పేరు మార్చి, నిధులను తగ్గించడం దారుణం అన్నారు. పేదల జీవనోపాధి పరిరక్షించాలన్నారు.