MDK: చేగుంట మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన రైతు మారబోయిన పర్వతాలు (40) పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 20న పురుగుల మందు సేవించగా చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు వివరించారు. కూతురు శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.