కోనసీమ: అయినవిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(PHC) కొత్తపేట ఆర్డీవో పి.శ్రీకర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. పీహెచ్సీ ద్వారా రోగులకు అందుతున్న సేవలను గురించి ఆరా తీశారు. ఆస్పత్రి గదులను, ఆపరేషన్ థియేటర్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.