VKB: కోట్పల్లికి సర్పంచ్ జంగం బసమ్మ భర్త రుమాల్ల సంగయ్యపై ఈనెల 18న అర్ధరాత్రి పలువురు వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టిన పోలీసులు గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఈ కేసు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులకు అందజేశామని పేర్కొన్నారు.