GDWL: ఇటిక్యాల మండల పరిధిలోని పెద్దదిన్నె గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర ఈ నెల 28 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మహోత్సవానికి హాజరుకావాలని జాతర నిర్వాహకులు బుధవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ జాతర గ్రామ ప్రజల ఐక్యతకు, భక్తికి ప్రతీకగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.