HNK: కాజీపేట పట్టణంలోని రైల్వే స్టేడియంలో 58వ సీనియర్ జాతీయ ఖోఖో పోటీలు జనవరి 11 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. తెలంగాణ ఖోఖో సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల నిర్వహణకు అవసరమైన అనుమతుల కోసం బుధవారం జంగా రాఘవరెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసి వినతి పత్రం అందజేశారు.