KMR: బీబీపేట్ మండల కేంద్రంలోని శ్రీహరిహరపుత్ర అయ్యప్ప స్వామి అలయ ఉత్సవమూర్తుల ఊరేగింపు ఈనెల 28వ తేదీ ఆదివారం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యుడు బాశెట్టి నాగేశ్వర్ చెప్పారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలదారులకు, మహిళలు ఊరేగింపులో పాల్గొనేందుకు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు, మాలాదారులు, మహిళలు పాల్గొన్నారు.