VZM: జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డిని కలిసి చర్చించారు. పెండింగ్ అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన మౌళిక వసతుల కల్పన, త్వరిత గతిన పరిశ్రమల ఏర్పాటు కోసం సత్వర చర్యలు తీసుకోవాలన్నారు.