KDP: చాపాడు మండల పరిధిలోని నెర్రవాడలో జనవరి 2 నుంచి ప్రభుత్వం చేపట్టనున్న భూముల రీ-సర్వే కార్యక్రమంపై బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. భూముల రీ-సర్వేకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రీ-సర్వే డీటీ నారాయణస్వామి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రీ-సర్వే కార్యక్రమం నిర్వహిస్తుందని పేర్కొన్నారు.