ADB: విధులలో నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి అని SP అఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం జైనథ్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ సందర్శించారు. మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పూర్తి అప్రమత్తతో విధుల నిర్వహణ చేపట్టాలని సూచించారు. ప్రజలలో పోలీసుల కీర్తి ప్రతిష్టలు పెరిగేలా విధుల నిర్వహణ చేపట్టాలని కోరారు.