WGL: రేపు క్రిస్మస్ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులకు క్రిస్మస్ అత్యంత పవిత్రమైన పండుగ అని మంత్రి సురేఖ పేర్కొన్నారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని ఆమె అన్నారు. ప్రేమ, శాంతి, సేవాభావం వంటి విలువలను ఆ బోధనలు తెలియజేస్తాయని మంత్రి పేర్కొన్నారు.