NLG: అర్హత ఉన్న దివ్యాంగులందరికీ బ్యాటరీతో నడిచే సైకిల్లను దశలవారీగా పంపిణీ చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ‘ప్రజావాణి’లో పలువురు తమకు బ్యాటరీ సైకిల్ అందించాలని వినతులొచ్చాయన్నారు. ఈసీఐఎల్ యాజమాన్యంతో మాట్లాడి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 50 బ్యాటరీ సైకిళ్లను ఇవాళ పంపిణీ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. త్వరలో మరికొంత మందికి అందిస్తామన్నారు.