BDK: కొత్తగూడెం కేంద్రంలో సీనియర్ కోర్టులో గుమస్తాగా ఎన్నో సంవత్సరాల పాటు నిష్టతో సేవలందించిన దివంగత దాసరి శ్రీనివాస్ దశ దిశ కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోర్టు న్యాయవాదులు, సహోద్యోగులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనివాస్ చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.