ATP: ఆడపిల్లల ప్రాముఖ్యతపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని RDO కేశవ నాయుడు ఆదేశించారు. అనంతపురంలోని రెవిన్యూ కార్యాలయంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం డివిజనల్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో RDO మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ జరగకుండా ఆకస్మిక తనిఖీలు, గట్టి నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు.