HYD: ధూల్‌పేటలో గంజాయి స్థావరాలపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. పీలా నవదీప్ శివ మందిర్ సమీపంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు STF A టీమ్, ధూల్‌పేట ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా దాడులు చేశాయి. ఈ తనిఖీల్లో 1.212 కేజీల గంజాయి పట్టుబడింది. నిందితుడు రాజేశ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న అభిషేక్ సింగ్ పరారీలో ఉన్నారు.