SRD: ఏసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శనీయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యేసు తన జీవితంలో ప్రేమ, శాంతి, కరుణ చూపారని చెప్పారు. క్రిస్టమస్ పండుగను ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.