MDK: రామాయంపేట మండల కేంద్రంలోని చర్చ్‌లో బుధవారం ప్రభుత్వం తరఫున ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. చర్చ్ ఆవరణలో MRO రజనీకుమారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ సత్యానందం నేతృత్వంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలు జరిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లను సన్మానించి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలిపారు.