W.G: ఆచంట వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ బుధవారం ప్రకటించారు. ఛైర్మన్గా టీడీపీ నాయకురాలు కేతా సత్యవతి, వైస్ ఛైర్మన్గా బీజేపీ సీనియర్ నాయకులు ముచ్చర్ల నాగ సుబ్బారావు నియమితులయ్యారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పదవుల భర్తీ ఖరారు కావడంతో కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.