కృష్ణా: సోలార్ విద్యుత్ వినియోగం మరింతగా పెరగాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సోలార్ విద్యుత్ 400వ కనెక్షనుదారుకు సబ్సిడీ మంజూరు పత్రం అందించే కార్యక్రమం జరిగింది. బుద్ధప్రసాద్, విద్యుత్ శాఖ ఎస్ఈ చిరంజీవి కలిసి సోలార్ విద్యుత్ కనెక్షన్ పొందిన శేషారావుకు మంజూరు పత్రం అందచేశారు.