ELR: పిప్పర జడ్పీ హైస్కూల్లో బుధవారం బాల్య ముక్తా భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సెక్టార్ సూపర్వైజర్ బీ. చంద్రావతి మాట్లాడుతూ.. బాలికా హక్కుల పరిరక్షణకు సమాజంలోని అందరూ కృషి చేయాలన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం జయ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు పాల్గొన్నారు.