W.G: విద్యార్థుల ఉజ్వల మైన భవిష్యత్తుకు కెరియర్ గైడెన్స్ దోహద పడుతుందని ఉండి మండలం మానవత సంస్థ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి మానవత సంస్థ ఆధ్వర్యంలో చెరుకువాడ హైస్కూల్, ఉండి హైస్కూల్లో విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ క్లాసులు బుధవారం నిర్వహించారు.టెన్త్ క్లాస్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు.