పీఎం ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో కోటి, గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లను నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అరుణాచల్‌లో 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు, కేదార్నాథ్, హేమ్‌కుండ్ రోప్‌వేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ సర్కార్ పనిచేస్తుందన్నారు.