TG: ఉమ్మడి రాష్ట్రంలో నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందని CM రేవంత్ అన్నారు. తెలంగాణ వస్తే నీటి సమస్య తీరుతుందని అంతా అనుకున్నాం.. కానీ KCR పాలనలో ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో పాలమూరును ఎండబెట్టారని ధ్వజమెత్తారు. KCR వలస వచ్చి పాలమూరు ఎంపీ అయ్యారని గుర్తు చేశారు. ఆ తర్వాత CM అయ్యారని కానీ పాలమూరుకు నీళ్లు రాలేదన్నారు.