TG: నూతన సంవత్సరంలో గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యధావిధిగా వచ్చే నిధులు కాకుండా సీఎం నిధి నుంచి గ్రామాలకు ప్రత్యేక నిధులు అందిస్తామని చెప్పారు. చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులకు అదనంగా ఈ నిధులు ఇస్తామన్నారు.