నారాయణపేట జిల్లా గుండుమల్ మండలం కొమ్మూరు గ్రామ సర్పంచ్ వనజ గంగాధర్ గౌడ్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వనజ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. తనకు అవకాశం ఇచ్చిన కొమ్మురు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.