BDK: బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామంలో బుధవారం గంజాయి తాగుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని బూర్గంపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.