WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన పద్మశాలి నూతన ఫంక్షన్ హాల్‌ను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కండేయ మహర్షి స్ఫూర్తితో పద్మశాలి సమాజం ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధిలో ప్రభుత్వం కట్టుబడును ఉంటుందని తెలిపారు.