KMR: జుక్కల్ మండలం పెద్దఎడ్ది గ్రామంలో గల బసవన్న మందిరానికి బుధవారం రోడ్డు పనులను నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఆస్పత్వార్ అనిల్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ మొరం రోడ్డుపై పెద్ద పెద్ద బండరాళ్లు ఉండడంతో గ్రామస్థుల సౌకర్యార్ధం ఈ పనులను చేపట్టామన్నారు. తమ పాలకవర్గంతో కలిసి పనులు చేపట్టారు. ఇందులో సభ్యులు ఫయింఖాన్, రాంబాయి అంజయ్య, పాల్గొన్నారు.