MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో మహిళల టీంను ఎంపిక చేసినట్టు యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ వై.శ్రీనివాసులు వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి జి.ఎన్.శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీలో సింథటిక్ ట్రాక్ ఉండటం మూలంగా క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు.