ADB: రాజకీయాల్లో ఉన్నతంగా రాణించి ప్రజలకు సేవ చేయాలని మాల సంక్షేమ సంఘం జిల్లాధ్యక్షుడు కొప్పుల రమేష్ అన్నారు. మావల మండలంలోని మాల సంక్షేమ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇటీవల నూతనంగా గెలిచిన పలు గ్రామాలకు చెందిన సర్పంచులను సంఘం ఆధ్వర్యంలో సన్మానించి అభినందించారు. డా. బీ.ఆర్.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.