ములుగు జిలా కోర్డులో కేంద్ర ప్రభుత్వం తరపున కేసులను వాదించేందుకు ప్యానెల్ కౌన్సిల్‌గా జిల్లాకు చెందిన కన్నోజు సునీల్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.