MDK: వెల్దుర్తి ప్రాథమిక పాఠశాలలోని పాత వంటగది భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. 20 ఏళ్లుగా వంటగదిగా సేవలు అందించగా ఇప్పుడు ఏ క్షణమైనా కూలిపోయే స్థితిలో ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడుతున్నారు. పాఠశాల ఆవరణలోనే ఈ భవనం ఉండటంతో విద్యార్థులు అటువైపు వెళ్లాలంటేనే బిక్కుబిక్కుమంటున్నారు.