KNR: కేంద్రం ఇచ్చిన గ్రామ పంచాయతీ నిధులను గత ప్రభుత్వం గ్రామాలకు ఇవ్వలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్లో విమర్శించారు. గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని నెల రోజుల గడువు విధించారు. ఆలోపు నిధులు ఇవ్వకుంటే సర్పంచ్లతో కలిసి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.