NGKL: జిల్లాలోని 11.25 లక్షల గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం చిన్నముద్దునూరులో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పశువుల ఎదుగుదలకు, నులిపురుగుల నిర్మూలనకు ఈ మందు ఎంతో దోహదపడుతుందని, రైతులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.