ELR: ఇనుమూరు గ్రామంలో గిరిజనులు వేసిన మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన గిరిజనులు, గిరిజన మహిళలపై దాడికి పాల్పడిన పోలీస్, రెవెన్యూ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల రాష్ట్ర ప్రతినిధుల బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం బుట్టాయిగూడెం (M) ఇనుమూరు బాధితులను కలసి పరామర్శించారు. గిరిజనేతరులకి హక్కులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు.