SRD: హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్, మౌలిక వసతులపై క్షేత్రస్థాయి వరకు రెండు రోజులుగా సమీక్షలు చేసినట్లు తెలిపారు. గ్రామాల సమస్యలపై ప్రజాప్రతినిధుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని పరిష్కార చర్యలు చేపడతామని పేర్కొన్నారు.