E.G: వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఇంఛార్జ్ జిల్లా కలెక్టర్ వై.మేఘా స్వరూప్ అన్నారు. బుధవారం రాజమండ్రిలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవం-2025ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ న్యాయ పాలన ద్వారా వినియోగ దారులకు సత్వర న్యాయం సాధ్యమవుతోందని పేర్కొన్నారు.