నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం కొడంగల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి రోడ్డు నీరు విద్య వైద్య సౌకర్యం కల్పిస్తామన్నారు. నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ వారి ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు.