పార్వతీపురం మండలం జమదాల గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు క్రిస్మస్ పండుగ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా కాలనీ ప్రజల సమక్షంలో క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అనంతరం గ్రామంలోని పేద మహిళలకు చీరలు, బియ్యం పంపిణీ చేశారు. ఇందులో వైసీపీ సీనియర్ నాయకులు బి.వాసు పాల్గొన్నారు.