BHNG: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయాంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వినతిపత్రం అందజేశారు. బుధవారం ఆలేరు పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్సీ కవితను కలిసిన విద్యార్థి సంఘాల నాయకులు తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.