ASR: రంపచోడవరం మండలంలోని ఐ.పోలవరం జంక్షన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రంపచోడవరం వైపు వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు యువకులను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.