BHPL: చిట్యాల మండల కేంద్రంలో విద్యాసంస్థలకు ఆనుకుని ఉన్న లక్ష్మీనరసింహ వైన్స్‌ను తక్షణం తొలగించాలని VCK యూత్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్, DYFI జిల్లా కార్యదర్శి నవీన్ డిమాండ్ చేశారు. ఇవాళ జిల్లా సూపర్డెంట్కు VCK, DYFI నాయకులు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. వెంటనే వైన్ షాపును ఊరి బయట పెట్టాలని లేకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.