MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఈ నెల 25, 26 తేదీల్లో సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అశ్వక్ హైమద్ తెలిపారు. క్రిస్మస్, బాక్సింగ్ డే సందర్భంగా క్రయవిక్రయాలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు రోజులు రైతులు ఉత్పత్తులు తీసుకురావద్దని, శనివారం నుంచి వ్యాపారాలు కొనసాగుతాయని వెల్లడించారు.