NLG: చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున మున్సిపల్ కార్మికుల పని వేళలు మార్చాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి ఎండి సలీం, జిల్లా ఉపాధ్యక్షులు దండేపల్లి సత్తయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కార్మికులతో కలిసి వారు బుధవారం నల్గొండ మున్సిపల్ మేనేజర్‌కు వినతినిచ్చి చలి కోట్లు, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరారు.