VZM: గజపతినగరం మండలంలోని కెంగువ, ఎం కొత్తవలస గ్రామ సచివాలయాలను బుధవారం ఎంపీడీవో కళ్యాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. అలాగే ప్రజలకు అందజేస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉద్యోగులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.