కృష్ణా: కోడూరు జీ.వీ అకాడమీ పాఠశాలలో ఎస్సై చాణక్య విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘గుడ్, బ్యాడ్ టచ్’ ట్రాఫిక్ నియమాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాలు మరియు పోక్సో చట్టం గురించి విద్యార్థులకు స్పష్టంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.