KRNL: కౌతాళం మండలంలోని ఎరిగెర ఎస్సీ కాలనీ ప్రజలకు ఇచ్చిన మాటను మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నిలబెట్టుకున్నారు. గుంతలమయంగా ఉన్న కాలనీ రోడ్ల సమస్యను సర్పంచ్ గోవిందు, ఎంఆర్పీఎస్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. క్రిస్మస్ పండుగ వేళ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆయన తక్షణమే స్పందించి, మట్టితో రోడ్లకు మరమ్మతులు చేయించారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.