W.G: గత టీడీపీ పాలనలో పాలకొల్లు నియోజకవర్గంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ. 130 కోట్ల ఖర్చుతో వివిధ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు మంత్రి రామానాయుడు చెప్పారు. బల్లిపాడులో రూ. 90 లక్షల ఖర్చుతో తాగునీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ ఏరియాలో కనీసం లక్ష రూపాయలు కూడా గత ప్రభుత్వం ఖర్చు చేయలేదని విమర్శించారు.