TG: ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ సీఎం కేసీఆర్.. ముఖ్యంగా నదీజలాలపై ప్రస్తావించారు. ఇప్పటి నుంచి ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క అని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. అయితే కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలని.. లెక్కలతో సహా అసెంబ్లీలో వివరించాలని ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సూచించారు. మరి ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? అని చర్చ జరగుతోంది.