ఖమ్మం రూరల్ మండలంలో అనుమతుల్లేని ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నకరికంటి వీరభద్రం అన్నారు. బుధవారం మండల బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ రాంప్రసాద్‌కు వినతి పత్రం అందించారు. సుమారు 30 ఇటుక బట్టీలకు అనుమతి లేదని, వెంటనే నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మండల అధ్యక్షుడు జాటోత్ మధునాయక్ డిమాండ్ చేశారు.